ఎడ్యుకేషన్ హబ్ గా తెలంగాణ
భారీగా విద్యా రంగానికి కేటాయింపు
హైదరాబాద్ – తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం , ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. శనివారం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ రాజ్ శాఖకు ప్రయారిటీ ఇచ్చామన్నారు.
రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామని ప్రకటించారు. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఉంటుందన్నారు. వాహన రిజిస్ట్రేషన్ కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేశామని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క.
. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐటీఐలను ఆధునీకరిస్తామన్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రాలను పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని తెలిపారు. దేవాదాయ ధర్మా దాయ శాఖ పరిధిలోని భూములను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క.
మేడారం జాతరకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆన్ లైన్ లో బంగారాన్ని సమర్పించేందుకు పోర్టల్ ను ఏర్పాటు చేశామన్నారు ఆర్థిక మంత్రి.