NEWSNATIONAL

రైతుల సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

Share it with your family & friends

జార్ఖండ్ సీఎం చెంపై సోరేన్

జార్ఖండ్ – సీఎం చెంపై సోరేన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రైతుల సంక్షేమం కోసం తాము కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం పాల‌ము పైప్ లైన్ నీటి పారుద‌ల ప‌థ‌కానికి శంకుస్థాప‌నం చేశారు చెంపై సోరేన్.

ఈ సంద‌ర్బంగా రైతుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప‌థ‌కం పూర్తి అయితే రైతులు నీటి కోసం ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు చెంపై సోరేన్. పైపు లైన్ ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని , దీని కార‌ణంగా సుల‌భంగా త‌మ పొలాల‌కు నీరు అందుతుంద‌ని చెప్పారు.

కొన్నేళ్ల పాటు సాగు నీటి కోసం చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, ఈ విష‌యం త‌న‌కు తెలిసి బాధకు గురైన‌ట్లు చెప్పారు. తాను సీఎంగా కొలువు తీరిన వెంట‌నే నీటి పారుద‌ల శాఖతో సంప్ర‌దించి వెంట‌నే నీటి ప‌థ‌కాల‌ను ప్రారంభించాల‌ని ఆదేశించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

త‌మ ప్ర‌భుత్వం ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా స‌రే రైతుల సంక్షేమానికి ప్ర‌యారిటీ ఇస్తుంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు చెంపై సోరేన్.