త్వరలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం
త్వరలోనే ప్రారంభిస్తామన్న సర్కార్
హైదరాబాద్ – డిప్యూటీ సీఎం , ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ 2024-25 సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. పంచాయతీరాజ్ కు ప్రయారిటీ ఇచ్చారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామన్నారు.
ఇదిలా ఉండగా తాము చెప్పినట్లుగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అందజేస్తామన్నారు. ఒకవేళ స్థలం కలిగి ఉంటే వారి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం చేస్తామని ప్రకటించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించామని స్పష్టం చేశారు. త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు మల్లు భట్టి విక్రమార్క. అంతే కాదు మెగా డీఎస్సీ వేయబోతున్నామని ప్రకటించారు. త్వరలోనే 15000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్ 1 లో 64 అదనపు పోస్టులు భర్తీ చేశామన్నారు.