ఎన్నికల్లో బీజేపీకి ఎదురే లేదు
కె. అన్నామలై కామెంట్
తమిళనాడు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో డీఎంకే పనై పోయిందన్నారు. ఎంత కాలం ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తుంటారని ప్రశ్నించారు. కష్టాల నుంచి కాపాడే సిరువపురి బాలసుబ్రమణ్యం దేవాలయం ఉన్న పొన్నేరి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజల ప్రేమ, ఆదరించిన తీరు తనను విస్తు పోయేలా చేసిందన్నారు.
తాను చేపట్టిన యాత్ర విజయవంతం అయ్యిందన్నారు చెప్పారు కె. అన్నామలై. గతంలో 2004-2014 డీఎంకే-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాలకు ఇచ్చే పన్ను వాటా 32 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. కానీ ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి పాలనలో. రాష్ట్రాలకు పన్ను పంపిణీని 42 శాతానికి పెంచారని స్పష్టం చేశారు కె. అన్నామలై.
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సంకీర్ణ సర్కార్ తిరిగి మూడోసారి పవర్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమిళనాడులో తాము క్లీన్ స్వీప్ చేస్తామని అన్నారు . ప్రజలు డీఎంకే పాలన పట్ల విముఖతతో ఉన్నారని చెప్పారు.