పొత్తులపై అమిత్ షా కామెంట్స్
త్వరలోనే క్లారిటీ వస్తుందన్న మంత్రి
న్యూఢిల్లీ – ట్రబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో త్వరలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ కొలువు తీరింది.
ఓ వైపు వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. మరో వైపు బీజేపీ జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని అంటోంది. కానీ ఇప్పటి వరకు పార్టీ క్యాడర్ అయోమయంలోనే ఉంది. దీంతో ఎవరు ఎవరితో కలిసి నడుస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అమిత్ చంద్ర షా.
పేరుకు జేపీ నడ్డా బీజేపీ చీఫ్ కానీ తెర వెనుక నడిపేదంతా అమిత్ చంద్ర షానే. ఈ విషయం బహిరంగ రహస్యం. ఈ తరుణంలో నిన్నటి దాకా దూరంగా ఉంటూ , తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి రూట్ మార్చారు. తాను కూడా మీ వెంటే నడుస్తానంటూ హామీ ఇచ్చారు.
ఈమేరకు ఆయన అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి మోదీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తరుణంలో అమిత్ షా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు.