వాస్తవాలకు ప్రతిరూపం బడ్జెట్
గత బడ్జెట్ లో అన్నీ అబద్దాలే
హైదరాబాద్ – తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ఆర్థిక శాఖ మంత్రి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 2024-25కు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ అబద్దాలు తప్ప నిజాలు చెప్పలేదన్నారు. వారి ఆస్తులు పెంచుకునేందుకు మాత్రమే దీనిని ఉపయోగించు కున్నారని ఆరోపించారు. గత బడ్జెట్ కంటే 70 వేల కోట్లు మైనస్ అయ్యిందన్నారు. దీన్ని బట్టి చూస్తే దాదాపు 23 శాతం ఖర్చు లేకుండా చేశామన్నారు సీఎం.
కేసీఆర్ అబద్దాలతో పాలన సాగించారని ఆరోపించారు. తొలి రోజు నుంచే నిజాలు చెప్పామని, ప్రజలకు వివరించే ప్రయత్నం చేశామన్నారు రేవంత్ రెడ్డి. నీటి పారుదల శాఖలో రూ. 16 వేల కోట్లు అప్పులు కట్టారని ఆరోపించారు.
అక్కర లేకున్నా పిలిచిన టెండర్లను రద్దు చేస్తామని ప్రకటించారు . బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయని, రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు సీఎం.