ఇంటింటికీ ఉచితంగా రేషన్
ప్రారంభించిన సీఎం మాన్
పంజాబ్ – రాష్ట్రంలో పేదలకు ఉచితంగా అందించే రేషన్ పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు సీఎం భగవంత్ మాన్. ఆయన కొలువు తీరిన వెంటనే సామాన్యులకు , మధ్య తరగతి ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్బంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఉపాధి అనేది అందుబాటులోకి తీసుకు వస్తామని స్పస్టం చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఘర్ ఘర్ మస్ట్ రేషన్ ( ఇంటింటికీ రేషన్ ) పథకాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వమే నేరుగా రేషన్ సరుకులను లబ్దిదారులకు అందించేందుకు శ్రీకారం చుట్టారు భగవంత్ మాన్. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. తాము ప్రజల కోసం పని చేస్తామని, తాము నేతలం కామని కేవలం సామాన్యులమని స్పష్టం చేశారు .
ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు భగవంత్ మాన్. ఇప్పటికే ఆయన తన కేబినెట్ లో మంత్రిని పీకి పారేశారు. అవినీతి రహిత పంజాబ్ గా మార్చాలన్నదే తన ప్రధాన డిమాండ్ అని చెప్పారు.