ట్రోలింగ్ పై డైరెక్ట‌ర్ మారుతి షాకింగ్ కామెంట్స్

Spread the love

కావాల‌ని రాజా సాబ్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు

హైద‌రాబాద్ : విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి తీసిన తాజా చిత్రం ది రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, అందాల భామ‌లు మాళ‌వికా మోహ‌న్, రిద్దీ కుమార్, నిధి అగ‌ర్వాల్ కీ రోల్స్ పోషించారు. ప్ర‌త్యేక పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ న‌టించాడు. పీపుల్స్ మీడియా ఆధ్వ‌ర్యంలో అధినేత‌లు టీజీ విశ్వ ప్ర‌సాద్, కూతురు కీర్తి ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ బ‌డ్జెట్ తో దీనిని తీశారు. అయినా ఊహించ‌ని రీతిలో మిశ్ర‌మ స్పంద‌న రావ‌డం, ప్ర‌త్యేకించి ట్రోల్స్ కు గురి కావ‌డం పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు త‌లెత్త‌డంతో కొన్ని రోజుల పాటు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాలేదు ద‌ర్శ‌కుడు మారుతి.

ఇదిలా ఉండ‌గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదిక‌పై నుంచి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు మారుతి. సినిమా న‌చ్చ‌క పోతే త‌న ఇంటికి రావాల‌ని చివ‌ర‌కు బ‌హిరంగంగానే అడ్ర‌స్ కూడా వెల్ల‌డించాడు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ అంతా త‌న‌పై దాడి చేసేందుకు వెళ్లారు. సెక్యూరిటీ , వ్య‌క్తిగ‌త సిబ్బందిపై కొంద‌రు అభిమానులు దాడి చేసేందుకు ప్ర‌యత్నం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించాడు ద‌ర్శ‌కుడు మారుతి. కొంద‌రు కావాల‌ని త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని, కానీ చివ‌ర‌కు త‌మ సినిమా రాజా సాబ్ త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని, పెట్టిన డ‌బ్బులు తిరిగి రావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు .

  • Related Posts

    భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా

    Spread the love

    Spread the loveఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నెట్ ఫ్లిక్స్ స్వంతం హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌తో డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మ‌రోసారి…

    మార్కెట్ మోసానికి గురైన డైరెక్ట‌ర్ కొడుకు

    Spread the love

    Spread the loveరూ. 63 ల‌క్ష‌లు కోల్పోయానంటూ ఫిర్యాదు హైద‌రాబాద్ : సైబ‌ర్ వ‌ల‌లో ప‌లువురు ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు న‌ష్ట పోతున్నారు. క‌ష్ట‌ప‌డిన వారంతా అత్యాస‌కు గురై డ‌బ్బుల‌ను కోల్పోతున్నారు. నిన్న మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భార్య ఏకంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *