మరాఠా గూండాల చేతుల్లోకి పోయింది
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్స్
ముంబై – శివసేన బాల్ థాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ నిప్పులు చెరిగారు. మరాఠా షిండే సర్కార్ మాఫియా, గూండాల చేతుల్లోకి పోయిందంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యిందని వాపోయారు.
ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని, అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు సంజయ్ రౌత్. సీఎం షిండే చోద్యం చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై పోయాయని, నిరుద్యోగం పెరిగి పోయిందని పేర్కొన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గ్రాండ్ విక్టరీని సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు సంజయ్ రౌత్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా 400 స్థానాలు సాధిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
తమ కూటమికి గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించడం తప్పదన్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నట్లు చెప్పారు.