పార్లమెంట్ ను మరిచి పోలేను
టీడీపీ ఎంపీ గల్లా జయ దేవ్
న్యూఢిల్లీ – తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యంత బరువైన హృదయంతో పార్లమెంట్ ను విడిచి పెడుతున్నానని వాపోయారు. తన పదవీ కాలం ముగిసిందని, ఈ సందర్బంగా తన బంధాన్ని ఈ సందర్బంగా నెమరు వేసుకున్నారు.
17వ లోక్ సభ చివరి రోజు అని తెలియగానే కళ్లల్లో నీళ్లు వచ్చాయని తెలిపారు గల్లా జయదేవ్. ఒక బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా నా రాష్ట్రం కోసం, నా నియోజకవర్గ ప్రజల కోసం పేరు తీసుకు వచ్చేలా ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు.
ఏనాడూ సమస్యల విషయంలో రాజీ పడలేదని, పదే పదే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూ వచ్చానని చెప్పారు గల్లా జయదేవ్. ఏనాడూ తాను తగ్గలేదన్నారు. తన వ్యాపారాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పని చేశానని అయినా ఎందుకనో రాజకీయాలలో ఉండాలని అనిపించడం లేదన్నారు గల్లా జయదేవ్.
ఈ దేశం కోసం కొన్ని ముఖ్యమైన విధానాలు, శాసన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడంలో భాగం పంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు . ఇదే సమయంలో పెన వేసుకున్న బంధాన్ని, జీవితాంతం నిలిచి పోయే జ్ఞాపకాలను నెమరు వేసుకున్నామని పేర్కొన్నారు.