రాజీవ్ స్టేడియం అభివృద్దిపై ఫోకస్
ఫోకస్ పెడతామన్న హెచ్ సీ ఏ చీఫ్
ముంబై – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చీఫ్ గా ఎన్నికయ్యాక క్రికెట్ రంగానికి సంబంధించి ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ ను మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలలో క్రికెట్ టోర్నీలను కూడా నిర్వహిస్తోంది హెచ్ సీ ఏ.
ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ఇప్పటికే భారత్ , ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ ను విజయవంతంగా నిర్వహించారు జగన్ మోహన్ రావు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో స్టేడియాలలను అభివృద్ది చేసే పనిలో పడ్డారు.
తాజాగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను పునర్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే కోల్ కోతాకు వెళ్లారు. అక్కడ ఈడెన్ గార్డెన్స్ ను సందర్శించారు. ఇదే సమయంలో ముంబై కి వెళ్లారు. అక్కడ వాంఖడే స్టేడియంను దగ్గరుండి పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా ముంబై క్రికెట్ అసోసియేషన్ కు వెళ్లారు.