కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడి
రేవంత్ రెడ్డి సర్కార్ పై కవిత ఫైర్
హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తీవ్రంగా స్పందించారు. అంకెల గారడీ తప్పా ప్రజలకు , రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేవి ఏమున్నాయంటూ ప్రశ్నించారు.
పేర్లు మార్చినంత మాత్రాన తెలంగాణ మారుతుందా అని నిలదీశారు కవిత. హామీలకు అనుగుణంగా అడుగులు వేయలేదన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేకుండా పోయిందన్నారు. ఓటాన్ అకౌంట్ లో కేటాయింపులు లేక పోయినా ప్రభుత్వ దృక్పథం ప్రజలకు ఉపయోగపడేలా లేదన్నారు.
ఈ బడ్జెట్ గొప్పల కోసం చేసింది తప్పా జనం కోసం కాదన్నారు కల్వకుంట్ల కవిత. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా నిరుపయోగమైన, ఎందుకూ పనికి రాని బడ్జెట్ గా ధ్వజమెత్తారు. చిత్త శుద్ధి లేని సర్కార్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించారని, ఇప్పుడు వాటి గురించి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. ఇకనైనా అబద్దాలతో కాకుండా నిజాలు చెప్పే ప్రయత్నం చేయాలని సూచించారు కల్వకుంట్ల కవిత.