చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కారు : స‌జ్జ‌నార్

Spread the love

విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌క పోతే అరెస్ట్ త‌ప్ప‌దు

హైద‌రాబాద్ : చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కార‌ని అన్నారు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్. ఎన్టీవీ ఛాన‌ల్ తో పాటు ఇత‌ర సామాజిక మాధ్య‌మాలు, యూట్యూబ్ ఛాన‌ల్స్ లో న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన రోడ్లు , భ‌వ‌నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో ఓ ఐఏఎస్ మ‌హిళా ఆఫీస‌ర్ తో లింకు ఉందంటూ ప్ర‌సారం చేయ‌డం, విశ్లేషణ‌ల‌తో కూడిన క‌థ‌నాలు ప్ర‌సారం కావ‌డం ప‌ట్ల స‌ర్కార్ సీరియ‌స్ గా తీసుకుంది. ఇదే స‌మ‌యంలో ఏకంగా సిట్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది స‌ర్కార్. సీఎం ఆదేశాల మేర‌కు రంగంలోకి దిగారు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి. ఈ మేర‌కు సిట్ ద‌ర్యాప్తున‌కుఆదేశిస్తున్నామ‌ని, ఇది స‌జ్జ‌నార్ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎవ‌రైనా స‌రే చ‌ట్టం ప్ర‌కార‌మే విచార‌ణ చేస్తార‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా స‌జ్జ‌నార్ దూకుడు పెంచారు. మ‌హిళా ఐఏఎస్ వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా ఇలాంటి క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. స‌మాజానికి మేలు చేకూర్చేలా మీడియా వ్య‌వ‌హ‌రించాల‌ని కానీ ఉన్న‌త వ‌ర్గాల‌ను, ప్ర‌ముఖుల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేసేలా , వ్య‌క్తిగ‌త హ‌నానికి దారి తీసేలా ఇలాంటి నీతి మాలిన‌, ఆధారాలు లేకుండా ప్ర‌సారాలు చేస్తారంటూ నిప్పులు చెరిగారు సీపీ స‌జ్జ‌నార్.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *