NEWSTELANGANA

బాల్క సుమ‌న్ కు నోటీసులు

Share it with your family & friends

అంద‌జేసిన పోలీసులు

హైద‌రాబాద్ – బీఆర్ ఎస్ కు చెందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు సంస్కారం అడ్డు వ‌స్తుంద‌ని, చెప్పుతో కొట్టాల‌ని ఉంద‌ని అన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్త‌మైంది.

పోలీసులు బాల్క సుమ‌న్ పై కేసు న‌మోదు చేశారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ ఆదేశించారు. మ‌రోసారి నోరు జారితే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రించారు కాంగ్రెస్ నాయ‌కులు. తాజాగా బాల్క సుమ‌న్ పై మంచిర్యాల పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు కావ‌డం విశేషం.

కేసులో భాగంగా బాల్క సుమ‌న్ నివాసానికి వెళ్లి మంచిర్యాల ఎస్ఐ స్వ‌యంగా నోటీసు అంద‌జేశారు. విచార‌ణ‌కు త‌ప్ప‌నిస‌రిగా రావాల‌ని స్ప‌ష్టం చేశారు. లేక పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా తాను ఎక్క‌డికీ పారి పోలేద‌న్నారు. ద‌ర్జాగా ఇక్క‌డే ఉన్నాన‌ని, ఎవ‌రికీ త‌ల‌వంచే ప్ర‌స‌క్తి లేద‌న్నారు బాల్క సుమ‌న్.

ఇదిలా ఉండ‌గా ఫిర్యాదు ఆధారంగా బాల్క సుమ‌న్ పై ఐపీసీ 294బి, 504,506 కింద కేసులు న‌మోదు చేశారు.