అరవింద్ కుమార్ పై విచారణ..?
శివ బాలకృష్ణ కేసులో సంచలనం
హైదరాబాద్ – గత ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏలో అన్నీ తానై వ్యవహరించిన మాజీ డిప్యూటీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. లెక్కకు మించిన ఆస్తులు కూడబెట్టారు. నోట్ల కట్టలు, ఆభరణాలు , పొలాలు, ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఏకంగా రూ. 250 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
ఈ విషయాన్ని స్వయంగా అవినీతి అధికారులే వెల్లడించడం విశేషం. తాజాగా ఏసీబీ కీలక ప్రకటన చేసింది. శివ బాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. విచారణలో భాగంగా ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్రపై అనుమానం ఉన్నట్లు తేల్చింది.
ఈ ఆఫీసర్ ను వెనకేసుకు వచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఫార్ములా వన్ రేస్ పేరుతో రూ. 40 కోట్లు ధారదత్తం చేయడం విస్తు పోయేలా చేసింది. మరో వైపు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డిపై కూడా సంచలన విమర్శలు చేశారు న్యాయవాది రాపోలు భాస్కర్.
ఇదిలా ఉండగా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరింది ఏసీబీ.