ఏపీ సీఎం జగన్ మహా నటుడు
ఎద్దేవా చేసిన నాగ బాబు
విశాఖపట్టణం – ఏపీ సీఎంపై షాకింగ్ కామెంట్స్ చేశారు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు నాగ బాబు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ పనై పోయిందన్నారు. వైసీపీ అధికారం నుంచి దిగి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు.
తాము సినిమాలలో నటిస్తుంటే జగన్ అంతకంటే ఎక్కువగా నటిస్తున్నాడని, ఒక రకంగా చెప్పాలంటే జగన్ మహా నటుడంటూ ఎద్దేవా చేశారు. ఆయనలా ఎవరూ నటించ లేరంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని వ్యూహాలు వేసినా చివరకు జనం తమను ఎన్నుకునేందుకు సిద్దమై పోయారని జోష్యం చెప్పారు.
సీఎం పదవి కోసం తండ్రిని, ఆస్తి కోసం స్వంత తల్లిని, తోబుట్టువు చెల్లిని గెంటేసిన పరమ స్వార్థ పరుడంటూ సంచలన ఆరోపణలు చేశారు నాగ బాబు. అధికారం రానంత వరకు తండ్రి ఫోటోను పెట్టుకుని ప్రచారం చేశాడని, కానీ పవర్ లోకి వచ్చాక తండ్రి ఫోటోను పక్కన పెట్టేశాడంటూ ఆరోపించారు.
ఇకనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని , విలువైన ఓటును తమకు వేయాలని కోరారు నాగ బాబు.