బీజేపీ ప్రజల్ని విడదీస్తోంది
మతం పేరుతో రాజకీయం
చండీగఢ్ – కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ తన విష భీజాలను మతం పేరుతో ప్రజల్లో నాటేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు.
ఆదివారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇవాళ ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగి పోయిందని , ద్రవ్యోల్బణం దారుణమైన స్థితిలో ఉందన్నారు. ఇప్పటి వరకు దేశానికి సంబంధించినంత వరకు ఏ ఒక్క సరైన నిర్ణయం తీసుకున్న పాపాన పోలేదంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సీరియస్ కామెంట్స్ చేశారు.
మనమంతా ఆదివాసీలు అని పిలుస్తున్నామని కానీ బీజేపీ శ్రేణులు వారిని అటవీ వాసులంటూ వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ. గిరిజనులు ఈ దేశానికి మూల వాసులని కానీ వారిని కూడా గుర్తించే స్థితిలో లేక పోవడం బాధ కలిగిస్తోందని చెప్పారు. మొత్తంగా రాబోయే ఎన్నికల్లో మరోసారి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోందని ఆరోపించారు.