ప్రజా హితం బీజేపీ లక్ష్యం
స్పష్టం చేసిన బండి సంజయ్
కరీంనగర్ జిల్లా – బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రజా హిత యాత్రను చేపట్టారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాక పోయినా అందరి కంటే ముందుగానే తను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.
యాత్రలో భాగంగా ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలను వింటున్నారు. తమ పార్టీ జనం కోసం, దేశం బాగు కోసం ప్రయత్నం చేస్తోందన్నారు బండి సంజయ్. గత పదేళ్లలో అన్ని రంగాలలో ఇండియా ముందంజలో కొనసాగుతోందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వైపు ప్రపంచం యావత్ చూస్తోందని చెప్పారు. ఈ పదేళ్ల సుపరిపాలనలో జరిగిన అభివృద్దది, అమలు చేసిన పేదల సంక్షేమ పథకాలు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
బండి సంజయే స్వయంగా ప్రజలకు వివరిస్తున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇదిలా ఉండగా బండి వెంట పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.