సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలి
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
పంజాబ్ – దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకమైనవని అన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఆదివారం పంజాబ్ లోని సమ్రాలాలో వర్కర్స్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. పంజాబీయులు హీరోలంటూ కితాబు ఇచ్చారు. ఇది అన్నదాతల భూమి అంటూ కొనియాడారు.
ఇక్కడి రైతులు, నాయకులు ఎన్నడూ అన్యాయానికి లొంగి పోలేదంటూ ప్రశంసలు కురిపించారు మల్లికార్జున్ ఖర్గే. వచ్చే ఎన్నికల్లో మనమంతా ఒక్క తాటిపైకి వచ్చి ప్రతి అన్యాయానికి, అకృత్యాలకు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఇండియా కూటమి గత కొన్నేళ్లుగా అలుపెరుగని రీతిలో పోరాడుతూ వస్తోందన్నారు. దేశం ప్రస్తుతం ప్రమాద పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గుర్తించి కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు మల్లికార్జున్ ఖర్గే.
కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో , న్యాయ్ యాత్రకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందన్నారు.