సీఎం రేవంత్ ను కలిసిన బొంతు
మర్యాద పూర్వకంగానే కలిశా
హైదరాబాద్ – కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా జంప్ అవుతున్నారు. ఒక్కసారిగా రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ రావడంతో పక్క చూపులు చూస్తున్నారు.
త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు తొలి మేయర్ బొంతు రామ్మోహన్. అంతకు ముందు మాజీ డిప్యూటీ మేయర్ బాబా షఫియోద్దీన్ మొన్నే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉన్నట్టుండి ఆదివారం బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలుసుకున్నారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఆయన రావడానికి ప్రధాన కారకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి.
తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వన్నాడ ప్రకాశ్ గౌడ్ ఇటీవలే సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత జంప్ అయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం సీఎంతో టచ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.