స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా : తమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం సస్యశ్యామలం, సాగు జలాలతో పచ్చటి పొలాలను తడపడం అన్నారు. అందుకే గడచిన రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టుల పై దృష్టి పెట్టామని చెప్పారు. నదుల నుండి మడులకు నీళ్లు పారించడమే లక్ష్యంగా పని చేశాం అన్నారు. ఆ క్రమంలో నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీని పూర్తి చేసి ఈ రోజు తెలంగాణ ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు.
ఈ రోజు యాసంగి పంటకు నీటిని విడుదల చేశామన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడడం తనకు సంతోషం కలిగిస్తోందని చెప్పారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేసేందుకు వెనుకాడ బోమంటూ స్పష్టం చేశారు సీఎం. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ లో అత్యధిక నిధులను కేటాయించడ జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.





