అబద్దాలు చెప్పడంలో మోదీ టాప్
నిప్పులు చెరిగాన రాహుల్ గాంధీ
పంజాబ్ – అబద్దాలు చెప్పడంలో ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నెంబర్ వన్ అంటూ ఎద్దేవా చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారంటూ ఆరోపించారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్బంగా రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం ప్రమాదంలో ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలను చేయడం మంచి పద్దతి కాదన్నారు. దీనిని ప్రజలు సీరియస్ గా తీసుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ.
పగలు రాత్రి అబద్దాలను ఎలా నిజం చేయాలనే దానిపై ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఇవాళ నిరుద్యోగులు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు.
ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ బీరాలు పలికారని, కానీ పండించిన పంటకు కనీస మద్దతు ధర రైతులకు ఇవ్వడంలో మోదీ ప్రయత్నం చేయక పోవడం దారుణమన్నారు.