NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Share it with your family & friends

ప‌లు జిల్లాల‌కు కోఆర్డినేట‌ర్లు

అమ‌రావ‌తి – ఏపీలో త్వ‌ర‌లో శాస‌న స‌భ , సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే జ‌ల్లెడ ప‌ట్టారు. ఎన్నిక‌ల క‌ద‌న రంగంలోకి ఎంట‌ర్ అయ్యారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఇప్ప‌టికే పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేశారు. అంతే కాకుండా చాలా మంది సిట్టింగ్ ల‌కు అభ్య‌ర్థుల‌ను మార్చారు. దీనిపై కొంత వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ప‌ని చేసే వారికే ప‌ట్టం క‌ట్ట‌క త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా సీఎం ఆదేశాల మేర‌కు పార్టీకి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాల బాధ్య‌త‌ల‌ను ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు అప్ప‌గించింది. ఈ మేర‌కు పార్టీ హై క‌మాండ్ వెల్ల‌డించింది.

ఒంగోలు పార్ల‌మెంట్ తో పాటు ఉమ్మ‌డి నాలుగు నెల్లూరు జిల్లాల కోఆర్డినేట‌ర్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని నియ‌మించింది. విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ చీఫ్ గా మ‌ల్లాది విష్ణును ఖ‌రారు చేసింది. గుంటూరు, న‌ర‌సారావుపేట‌, బాపట్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఎంపీ విజ‌య సాయి రెడ్డిని నియ‌మించింది.

ఇక క‌ర్నూలు , నంద్యాల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల రీజినల్ కో ఆర్డినేట‌ర్ గా పి. రామ సుబ్బా రెడ్డి, క‌డ‌ప‌, రాజంపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కె. సురేష్ బాబు, ఉమ్మ‌డి విశాఖ జిల్లా డిప్యూటీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా గుడివాడ అమ‌ర్ నాథ్ ను నియ‌మించింది అధిష్టానం.