ఏపీలో బీజేపీకి జనాదరణ
దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు భారతీయ జనతా పార్టీకి జనం నుంచి ఆదరణ లభిస్తోందని అన్నారు ఆ పార్టీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. రోజు రోజుకు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టం చేశారు.
గత మూడు రోజులుగా ఆరు జిల్లాలకు చెందిన పలువురు పారిశ్రమికవేత్తలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారని అన్నారు పురంధేశ్వరి. విద్వేషం ..నియంతృత్వం మినహా వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది వాతావరణం లేకుండా పోయిందన్నారు.
ప్రభుత్వ పని తీరులో లోపాలను ప్రస్తావిస్తే కేసులు, అరెస్టులు, అణచివేతలతో భయాందోళనలు స్రుష్టిస్తున్నారని ఆవేదన చెందారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్థాయి సమావేశానికి పురందేశ్వరి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సైతం తమవంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్నా… వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా అధికారులు అవి కేంద్ర పథకాలుగా వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి వచ్చిందని అన్నారు.