కృష్ణా జలాలు ఏపీకి ధారదత్తం
నిప్పులు చెరిగిన ఉత్తమ్ కుమార్
హైదరాబాద్ – రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఏకాంతంగా చర్చలు జరిపారని పేర్కొన్నారు.
మొత్తంగా కృష్ణా జలాలను పక్క రాష్ట్రానికి దారదత్తం చేశారంటూ ధ్వజమెత్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే అలయ్ బలయ్ చేసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ శాసన సభ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి చెప్పారని ఇంతకంటే ఇంకేం కావాలని నిలదీశారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుండి రోజుకు 3 టీఎంసీల నీళ్లను ఏపీ రాష్ట్రం తరలించుకు పోతుంటే ఎన్నడైనా కేసీఆర్ మాట్లాడారా అని నిలదీశారు. ప్రస్తుత ఏపీ సీఎం మే 28, 2019న తెలంగాణ భవన్ కు వచ్చారని, ఏకాంతంగా చర్చలు జరిపారని, కనీసం ఏం మాట్లాడుకున్నారనే దానిపై కూడా బయటకు చెప్పలేదన్నారు. ఇంతకన్నా ఘోరం ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు.