కేసీఆర్ రాక పోవడం దారుణం
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు అసెంబ్లీకి రాలేక పోయారని ప్రశ్నించారు.
ఒక రకంగా అసెంబ్లీని, తెలంగాణ సమాజాన్ని అవమాన పర్చడమేనని పేర్కొన్నారు సీఎం. ఇవాళ తెలంగాణ శాసన సభ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాణ ప్రదమైన కృష్ణా జలాలపై ప్రజా సర్కార్ చర్చ పెట్టిందన్నారు.
ఈ సందర్బంగా మూకుమ్మడిగా మంత్రివర్గం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తి లేదని తీర్మానం చేసింది. ఇంతటి ప్రాధాన్యత అంశంపై చర్చ జరుగుతుంటే వివరణ ఇవ్వాల్సిన, సూచనలు ఇవ్వాల్సిన మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం బాధ కు గురి చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి.
ఒక నాడు ఎంపీగా గెలిచేందుకు కారణమైన పాలమూరు జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జిల్లా ప్రయోజనాల గురించి ఏనాడైనా మాట్లాడాడా అని నిలదీశారు సీఎం.