పాపాల భైరవుడు కేసీఆర్
ఫామ్ హౌస్ లో దాక్కుంటే ఎలా
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన కేసీఆర్ ను ఏకి పారేశారు. పాపాలన్నీ చేసి తనకేమీ తెలియదని మౌనంగా ఉండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇకనైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలని కేసీఆర్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రాజెక్టుల పేరుతో అందినంత మేర దోచుకున్నారని ఇప్పుడు దోచుకున్న వాటిని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సతమతం అవుతున్నారని ఆరోపించారు. తిన్నదంతా కక్కించే దాకా తాను ఊరుకోనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలే ఉంటుందని పదే పదే బలుపు మాటలు మాట్లాడటం మాను కోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకనైనా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కల్వకుంట్ల కవిత తమ మాట తీరు మార్చుకోక పోతే చివరకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు .
పాపాలు చేసినందుకు ప్రాయశ్చితం చేసుకోవాలని, చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.