భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
రూ. 5.48 కోట్లు వచ్చాయన్న టీటీడీ
తిరుమల – రోజు రోజుకు పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరుంది. వడ్డీ కాసుల వాడిగా కొలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు స్వామి వారిని నిత్యం స్మరిస్తుంటారు. చిన్నారుల నుంచి పెద్దలు, పండు వృద్దులు సైతం ఒక్కసారైనా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కోవాలని అనుకుంటారు.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బంది, ఉద్యోగులు, శ్రీివారి సేవకులు విశిష్ట సేవలు అందజేస్తున్నారు.
ఇక దర్శనం విషయానికి వస్తే 69 వేల 314 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 165 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు నిత్యం స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.48 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
స్వామి వారి దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 12 గంటల సమయం పడుతుందని స్పష్టం చేసింది.