మనసు మార్చుకున్న మాగుంట
వైసీపీలో మరో వికెట్ డౌన్
అమరావతి – ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి కోలుకోలేని షాక్ తగులుతోంది. ఇప్పటికే పలువురు టికెట్లు రాని వారంతా పక్క చూపులు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీతో పాటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలో నువ్వా నేనా అంటున్నాయి.
పోటీకి సై అంటూ సవాల్ విసురుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త , ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల తుది జాబితాలో ఆయన పేరు లేక పోవడంతో విస్తు పోయారు.
ఈ తరుణంలో మరో వికెట్ డౌన్ అయ్యేలా కనిపిస్తోంది. ఆయనకు తిరిగి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హై కమాండ్ నిరాకరించింది. దీంతో ఆయన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన వైసీపీని దూరమయ్యేందుకు డిసైడ్ అయ్యినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును కలవనున్నట్లు టాక్.
దీంతో టీడీపీలో చేరేందుకు సిద్దమైనట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.