వెంటనే తుది ఫలితాలు ప్రకటించాలి
డీఎల్, జేఎల్ రిజల్ట్స్ పై ఆర్ఎస్పీ
హైదరాబాద్ – బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ గురుకుల టీచర్స్ రిక్రూట్ మెంట్ బోర్డులో డీఎల్, జేఎల్ ఫలితాలు ఇవ్వక పోవడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. వెంటనే రిజల్ట్స్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేక పోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఇదిలా ఉండగా కేవలం పీజీటీ తుది ఫలితాలు ఇచ్చారని , ఇతర పరీక్షలు రాసిన వారు తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. డీఎల్, జేఎల్ ఫలితాలు వస్తే పీజీటీలో జాబ్స్ వచ్చిన వారికి ఒకవేళ డీఎల్ జాబ్ వస్తే మళ్లీ పీజీటీ ఖాళీలు అలాగే ఉండి పోతాయని పేర్కొన్నారు ఆర్ఎస్పీ.
ముందుగా అత్యున్నత పోస్టులను భర్తీ చేయాలని, ఆతర్వాత మిగతా పోస్టులు నింపితే బావుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఎలా చైర్మన్ ను అప్పగిస్తారంటూ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.