DEVOTIONAL

గ‌ట్ట‌మ్మ గుడిలో దాస‌రి సీత‌క్క

Share it with your family & friends

ప్ర‌త్యేక పూజ‌లు చేసిన మంత్రి

ములుగు జిల్లా – ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన మేడారం జాత‌ర‌కు ల‌క్ష‌లాది మంది జ‌నం త‌ర‌లి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే సుదూర ప్రాంతాల‌న ఉంచి వ‌స్తుండ‌డంతో మేడారం జ‌న‌సంద్రంగా మారింది. ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు మంత్రి దాస‌రి సీత‌క్క‌. ఈసారి క‌నీవిని ఎరుగ‌ని రీతిలో ఏర్పాట్లు చేసిన‌ట్లు మంత్రి ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ దాస‌రి సీత‌క్క సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు.

ఆమె గ‌ట్ట‌మ్మ దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ప‌రిస‌ర ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది రాకుండా చూడాల‌ని సూచించారు.

మేడారం జాత‌ర సంద‌ర్బంగా ఇప్ప‌టికే రాష్ట్ర స‌ర్కార్ భారీ ఎత్తున నిధుల‌ను విడుదల చేసింది. ఈ మేర‌కు ముంద‌స్తుగా మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌లు ద‌గ్గ‌రుండి తామే చూసుకుంటున్నారు. అన్నీ తామై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.