NEWSTELANGANA

కాళేశ్వ‌రం అద్భుతం – హ‌రీశ్

Share it with your family & friends

ప్ర‌భుత్వం దుష్ప్ర‌చారం

హైద‌రాబాద్ – ఓ వైపు కాంగ్రెస్ పార్టీ చీఫ్ , సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మంగ‌ళవారం మేడిగ‌డ్డ ప్రాజెక్టును సంద‌ర్శించేందుకు బ‌స్సుల‌లో బ‌య‌లుదేరి వెళ్లారు. దీనిపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు.

ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సీఎంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌కు ప్రాజెక్టుల‌పై చిత్త శుద్ది లేద‌న్నారు. కేవ‌లం కాల‌యాప‌న చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అంటే నీళ్లు, నిధులు కాద‌ని అది తెలంగాణ ఆత్మ గౌర‌వానికి సంబంధించిన‌ద‌ని పేర్కొన్నారు.

3 బ్యారేజీలు, 15 రిజ‌ర్వాయ‌ర్లు, 19 స‌బ్ స్టేష‌న్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కి.మీ సొరంగాలు, 1531 కి.మీ గ్రావిటీ కెనాల్, ప్రెజ‌ర్ మెయిన్స్ 98 కి.మీ, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కూడుకుని ఉన్న‌ద‌ని, ఇలాంటి ప్రాజెక్టు ప్ర‌పంచంలో ఎక్క‌డా లేద‌ని స్ప‌ష్టం చేశారు హ‌రీశ్ రావు.

సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి.