జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం
టీడీపీ నేత నారా లోకేష్ కామెంట్
అమరావతి – టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. మంగళవారం పాతపట్నం శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిన్నటి దాకా నవ రత్నాలు పేరుతో ప్రజలను మోసం చేశారంటూ ధ్వజమెత్తారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు నారా లోకేష్. తాము వచ్చాక అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యారంటూ మండిపడ్డారు. జనం జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు సిద్దమై ఉన్నారని పేర్కొన్నారు నారా లోకేష్. రాబోయేది తమ రాజ్యమని తమను తట్టుకోవడం కష్టమన్నారు.
ఇప్పటికే రెడ్ బుక్ లో ఎవరెవరు రాజకీయాలు చేశారో, ఎవరెవరు జగన్ రెడ్డిని చూసుకుని రెచ్చి పోయారో వారి పేర్లు నమోదు చేసుకున్నామని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.