పట్టుబడిన శామీర్ పేట తహశీల్దార్
రూ. 10 లక్షలతో పట్టుకున్న ఏసీబీ
హైదరాబాద్ – రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ముమ్మరంగా దాడులు చేపడుతోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మొన్నటికి మొన్న వందల కోట్ల ఆస్తులు కలిగిన జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ డైరెక్టర్ శివ బాలకృష్ణను పట్టుకుంది.
ఆయనకు బెయిల్ ఇవ్వలేదు కోర్టు. లెక్కకు మించి ఆస్తులను పోగేశారు. వందల కొద్దీ ఎకరాలు, ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్స్ , కేజీల కొద్దీ బంగారం, నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఇది పక్కన పెడితే తాజాగా మరో అవినీతి తిమింగలం చిక్కింది.
రెడ్ హ్యాండెడ్ గా 10 లక్షల రూపాయలతో పట్టుబడ్డారు శామీర్ పేట తహశీల్దార్. ఆయనతో పాటు స్వంత డ్రైవర్ బద్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓ పని కోసం తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మార్వో.
అయితే తనకు ఏ పాపం తెలియదని , ఇదంతా కావాలని తనతో చేయించాడంటూ డ్రైవర్ వాపోయాడు. ఇదిలా ఉండగా నోట్ల కట్టలతో తహశీల్దార్ , డ్రైవర్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. వీరి వాంగ్మూలం తీసుకుని కోర్టులో ప్రవేశ పెడతామని చెప్పారు.