ట్రోల్స్ పై మహిళల పోరాటం
తప్పదన్న రచయిత్రులు
హైదరాబాద్ – టెక్నాలజీ పెరిగింది. ఈ మధ్యన అది మరీ ఎక్కువైంది. వ్యక్తిగత దూషణలకు దిగడం పరిపాటిగా మారింది. మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. విచిత్రం ఏమిటంటే ప్రతి రంగంలోనూ ఇప్పటికే మహిళలే బాధితులుగా ఉంటూ వస్తున్నారు. వారికి రాను రాను రక్షణ లేకుండా పోతోంది.
ఇదే సమయంలో వారి వ్యక్తిగత సమాచారాన్ని ఆసరాగా చేసుకుని ట్రోల్స్ ఎక్కువగా ఈమధ్యన పెరిగాయి. దీనిపై యుద్ధం ప్రకటించారు మహిళా రచయితలు. వారికి వెన్ను దన్నుగా నిలిచారు ప్రముఖ రచయిత, మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.
ట్రోల్స్ కు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించేందుకు సిద్దమయ్యారు. ప్రజాస్వామ్య రచయితల వేదిక మహాసభలు నిర్వహించారు. ఈ సభల ఫలితంగా ప్రత్యేకంగా ఫోరంను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా తాను కూడా ట్రోలింగ్ కు గురవుతున్నట్లు వాపోయారు చక్రపాణి.
ఇదిలా ఉండగా ఫోరమ్ ముఖ్య ఉద్దేశం ట్రోల్స్ చేస్తున్న వాళ్లను ఫ్లాగ్ చేయడం, బుక్ చేయించడంతో పాటు ట్రోల్స్ ఫేస్ చేస్తున్న బాధితుల వైపు నిలబడటం ఈ ఫోరమ్ ఏర్పాటు ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఈ ఫోరంలో జహా ఆరా, మానస యెండ్లూరి, అరుణ గోగుల మంద, తులసి చందు, ఉదయ భాను, బైరి నరేష్ , కేఎన్ మల్లీశ్వరి ఉన్నారు.