అన్నదాతలపై దాడులు తగదు
నిప్పులు చెరిగిన బెంగాల్ సీఎం
పశ్చిమ బెంగాల్ – సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇలాగే వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలపై దాడులకు దిగుతారా అంటూ నిలదీశారు. మంగళవారం దీదీ మీడియాతో మాట్లాడారు.
అన్నం పెట్టే అన్నదాతలపై దాడులు చేస్తే దేశం ఎలా ముందుకు వెళుతుందని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వ్యక్తిగత ప్రచారంపై ఉన్నంత శ్రద్ద, ఆసక్తి, కోరిక ప్రజలు , రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న కోరిక లేక పోవడం దారుణమన్నారు.
రైతులపై దాడులకు దిగడం పరిపాటిగా మారిందన్నారు సీఎం. ఈ సందర్బంగా బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర సర్కార్ వైఫల్యం చెందిందని ఫైర్ అయ్యారు. పీఆర్ స్టంట్స్ తో కలిసి విక్షిత్ భారత్ భ్రమను బహిర్గతం చేసిందన్నారు.
రైతుల నిరసనను అణచి వేసే బదులు దేశానికి హాని కలిగించిన వారు పెంచి పోషించిన అహంకారాలను, అధికార దాహంతో కూడిన ఆశయాలను , సరిపోని పాలనను తగ్గించడంపై ముందు బీజేపీ దృష్టి సారించాలని సూచించారు దీదీ.