సైబర్ సెక్యూరిటీ, పట్టణ కాలుష్యంపై విస్తృత చర్చలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 2026లో పాల్గొంది. దిగ్గజ కంపెనీలతో సమావేశమైంది. ఈ సందర్బంగా గూగుల్ అపాక్ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వాతావరణ మార్పు, స్థిరమైన వ్యవసాయం, పట్టణ కాలుష్యంపై చర్చలు జరిపారు. ప్రత్యేకించి ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ భద్రత, స్టార్టప్ ఆవిష్కరణలలో సహకారాన్ని అన్వేషిస్తూ తెలంగాణ CURE, PURE , RARE ఫ్రేమ్‌వర్క్ , కోర్ హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చాలనే మా దార్శనికతను పంచుకోవడం జరిగింది.
భారతదేశంలో మొట్టమొదటి Google for Startups హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు నేను గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్, సీనియర్ ఆఫీసర్ సంజయ్ గుప్తాలకు ధన్యవాదాలు తెలిపారు. అధిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం గురించి ప్రత్యేకంగా చర్చించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాతావరణ చర్య, వ్యవసాయం, స్టార్టప్‌లు ,డిజిటల్ మౌలిక సదుపాయాలలో తెలంగాణకు Google పూర్తి మద్దతును ఇస్తామని ప్రకటించారు మిస్టర్ గుప్తా.





