టీటీడీ జేఈవోగా నియమించిన ఏపీ సర్కార్
అమరావతి : ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను తెలంగాణలో నియమించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన బిడ్డకు కీలకమైన పదవిని అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన సీనియర్ ఐఏఎస్ డాక్టర్ ఎ. శరత్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ)లో విద్య, ఆరోగ్య అంశాలకు సంబంధించి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించింది.
ఇదిలా ఉండగా శరత్ 2005 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. తెలంగాణ కేడర్ కింద పని చేశారు. జిల్లా కలెక్టర్ గా కామారెడ్డి, తదితర జిల్లాల్లో పని చేవారు. ఆ తర్వాత రాష్ట్ర సర్కార్ లో కీలకమైన గిరిజన సంక్షేమ శాఖలో కార్యదర్శి హొదాలో విధులు నిర్వహించారు. కలెక్టర్‌గా జిల్లా పరిపాలన, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి పలు ప్రభుత్వ కార్యక్రమాలను నడిపించడంలో కీలక పాత్ర వహించారు.ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో ప్రధానంగా పల్లె ప్రాంతాల్లో జన జీవితం, విద్య, ఆరోగ్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. తను పాలనా పరంగా పదవీ విరమణ పొందినా తనకు కీలక పదవి దక్కడం విశేషం.







