అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల‌కు నో వ‌ర్క్ నో పే

Spread the love

విధానం ఉండాల‌న్న స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఉత్త‌ర ప్రదేశ్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న వివిధ రాష్ట్రాల స్పీక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కొలువు తీరిన వెంట‌నే శాస‌న స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి గురించి కూడా ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు. ఇదేక్ర‌మంలో త‌ను తీవ్ర స్థాయిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ క్ర‌మంలో యూపీ స్పీక‌ర్ల స‌మావేశంలో ఎమ్మెల్యేల గురించి మ‌రోసారి మండిప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం ఉండాలని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

.ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్పీకర్లు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. లేక‌పోతే ఎమ్మెల్యేలు మార‌రంటూ పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మ‌కంతో ఓట్లు వేసి గెలిపిస్తే దేవాల‌యం లాంటి శాస‌న స‌భ‌కు రాకుండా ఉంటే ఎలా అని ప్ర‌శ్నించారు. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చింతకాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. క‌నీసం నో వ‌ర్క్ నో పే విధానాన్ని అమ‌లు చేసిన‌ట్ల‌యితే ఎమ్మెల్యేల‌లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు ఏపీ స్పీక‌ర్.

  • Related Posts

    జెరా గ్లోబ‌ల్ సీఈవోతో నారా లోకేష్ భేటీ

    Spread the love

    Spread the loveప‌లు దిగ్గ‌జ కంపెనీల‌తో వ‌రుస స‌మావేశాలు దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం దావోస్ లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్…

    గూగుల్ అపాక్ అధ్య‌క్షుడు సంజ‌య్ గుప్తాతో సీఎం భేటీ

    Spread the love

    Spread the loveసైబ‌ర్ సెక్యూరిటీ, ప‌ట్ట‌ణ కాలుష్యంపై విస్తృత చ‌ర్చ‌లు హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *