రైతులపై దాడి దారుణం
కేంద్ర సర్కార్ పై డీకే ఫైర్
బెంగళూరు – తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన రైతులపై దౌర్జన్యం చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇది మంచి పద్దతి కాదన్నారు. వారు రేయింబవళ్లు కష్టపడి దేశానికి అన్నం పెడుతున్నారని వారి పట్ల గత కొంత కాలం నుంచి మోదీ సర్కార్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు.
మంగళవారం ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు డీకే శివకుమార్. ప్రభుత్వం పనిగట్టుకుని దాడులకు దిగడం మంచి పద్దతి కాదన్నారు. తమకు రావాల్సిన మద్దతు గురించి అడగడం రైతుల ప్రాథమిక హక్కు అని, దానిని మరిచి పోయి టియర్ గ్యాస్ ప్రయోగించడం ఎంత వరకు సబబు అని నిలదీశారు .
కేంద్ర సర్కార్ తన హామీని నిలబెట్టు కోవడంలో , రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు డీకే శివకుమార్. రైతులు నిరసనకు దిగడం గత మూడేళ్లలో ఇది రెండోసారి అని పేర్కొన్నారు. పాలనా పరంగా చేతకానితనాన్ని సూచిస్తోందని ఎద్దేవా చేశారు.