NEWSNATIONAL

రైతుల‌కు రాహుల్ భ‌రోసా

Share it with your family & friends

ప్ర‌తి రైతుకు చ‌ట్ట‌ప‌ర‌మైన హామ

న్యూఢిల్లీ – త‌మ న్యాయ ప‌ర‌మైన డిమాండ్లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ మంగ‌ళ‌వారం రైతు సంఘాల ఆధ్వ‌ర్యంలో వేలాది మంది రైతులు ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. హ‌ర్యానా..పంజాబ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. వీరిపై పోలీసులు బాష్ప వాయువును ప్ర‌యోగించారు. దీంతో ప‌లువురు రైతులు గాయ‌ప‌డ్డారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై తీవ్రంగా స్పందించారు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ. రైతులకు తమ పార్టీ త‌ప్ప‌కుండా అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. రైతులు గొంతెమ్మ కోరిక‌లు కోర‌వ‌డం లేద‌న్నారు. కేవ‌లం తాము పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర కావాల‌ని మాత్ర‌మే అడుగుతున్నార‌ని అన్నారు.

రైతులు చేస్తున్న డిమాండ్లు న్యాయ బ‌ద్ద‌మైన‌వేన‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ వ్యాపార‌స్తులు, వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ కంపెనీల‌కు మేలు చేకూర్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా తాము గ‌నుక అధికారంలోకి వ‌స్తే స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సులు అమ‌లు చేస్తామ‌ని, ఈ మేర‌కు చ‌ట్టం తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు రాహుల్ గాంధీ.