ఇలా చేయడం తప్పేనంటూ మన్నించాలని కోరింది
ములుగు జిల్లా : మేడారం జాతర సందర్బంగా నటి టీనా శ్రావ్య వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన పెంపుడు కుక్కను కూడా ఇక్కడికి తీసుకు వచ్చింది. ఏమైందో ఏమో కానీ అందరూ అమ్మ వార్లకు బెల్లాన్ని తులా భారం వేస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఇది కొన్ని ఏళ్ల నుంచి వస్తూ ఉన్న సంప్రదాయం. అయితే నటి టీనా శ్రావ్య దానికి భిన్నంగా కుక్కకు కూడా తులా భారం వేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీంతో పెద్ద ఎత్తున వన దేవతల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచిత్రం ఏమిటంటే ఆమె కుక్కకు తులాభారం వేసి మేడారం ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిందంటూ తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేశారు. దీంతో అమ్మడు టీనా శ్రావ్య దిగి వచ్చింది. ప్లీజ్ నన్ను ట్రోల్ చేయవద్దంటూ కోరింది. అంతే కాకుండా బహిరంగంగానే తాను క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపింది. విషయం వివాదం కావడంతో శ్రావ్య అలెర్ట్ అయ్యారు. తన ఉద్దేశ్యం అది కాదంటూ సెల్ఫ్ వీడియో ఒకటి విడుదల చేశారు.. క్షమాపణలు కోరుతూ వివాదానికి ముగింపు పలకాలని కోరారు..తన కుక్క ఆరోగ్యం కోసమే మొక్కు తీర్చుకున్నానని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసారు.








