కృష్ణా జలాలు జీవన్మరణ సమస్య
మాజీ సీఎం కేసీఆర్ కామెంట్స్
నల్లగొండ – మాజీ సీఎం కేసీఆర్ శంఖారావం పూరించారు. ఎన్నికలకు సన్నద్ధం అయ్యారు. తనపై ముప్పేట దాడి మొదలు పెట్టినా ఎక్కడా తగ్గేది లేదంటూ ప్రకటించారు. తన వాణిని వినిపించారు. తనదైన శైలిలో ప్రసంగించారు. ఓ వైపు అనారోగ్యం ఉన్నా లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేశారు కేసీఆర్. ఇందులో ఆయన సక్సెస్ అయ్యారు.
తాజాగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ప్రజా ప్రతినిధులు, గులాబీ దండు జనం మీద పడడంతో కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ సమయంలో అధికారం నుంచి దూరమయ్యాక కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న పార్టీ క్యాడర్ లో స్థైర్యం నింపేందుకు నల్లగొండ సభను ఎంచుకున్నారు. ఆ మేరకు బీఆర్ఎస్ నిర్వహించిన సభకు జనం పెద్ద ఎత్తున తరలి రావడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది.
ఈ సందర్బంగా కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కృష్ణా జలాలు మన జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదన్నారు గతంలో ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయని, తాము వచ్చాక వారికి ఉన్న ఇబ్బందులు తొలగించామన్నారు. ఇది రాజకీయ సభ కాదు పోరాట సభ అన్నారు కేసీఆర్.