NATIONALNEWS

రైతుల ఆగ్ర‌హం ఢిల్లీ దిగ్బంధం

Share it with your family & friends

స‌ర్కార్ దిగొచ్చే దాకా పోరాటం

న్యూఢిల్లీ – తాము పండించిన పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని, న్యాయ ప‌ర‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ రైతులు వేలాదిగా త‌ర‌లి వ‌చ్చారు. దేశ రాజ‌ధానిని ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేశారు. పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. రైతుల‌ను చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు బాష్ప భాయువును ప్ర‌యోగించారు. దీంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రైతుల ఆందోళ‌న‌తో ఇవాల్టితో ఆందోళ‌న కొన‌సాగుతోంది. ఎక్క‌డ చూసినా రైతుల‌తో న‌గ‌రం నిండి పోయింది. నిన్న‌టి నుంచి ఢిల్లీలోనే రైతులు ఇక్క‌డే తిష్ట వేశారు. రాత్రింబ‌వ‌ళ్లు ఇబ్బందులు ప‌డ్డారు. పంజాబ్ , హ‌ర్యానా నుంచి భారీ ఎత్తున ఢిల్లీకి తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు రైతులు.

ఇదిలా ఉండ‌గా పార్ల‌మెంట్ వైపు రాకుండా ఉండేందుకు పోలీసులు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రైతులను అడ్డుకున్నారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండ‌గా కేంద్ర స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు రైతు నాయ‌కుడు స‌ర్వ‌న్ సింగ్ పంథేర్ .

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదొక బ్లాక్ డే అని పేర్కొన్నారు. రైతుల‌పై టియ‌ర్ గ్యాస్ ను, ర‌బ్బరు బుల్లెట్లు, వాట‌ర్ క్యాన‌న్ల‌ను ప్ర‌యోగించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.