కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు రాజ్యం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
హైదరాబాద్ – రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. బుధవారం బడ్జెట్ సందర్బంగా జరిగిన చర్చల్లో తమను మాట్లాడకుండా చేశారంటూ ఆరోపించారు మాజీ మంత్రులు హరీశ్ రావు , కేటీఆర్ , మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు రాకుండా తమను అడ్డుకోవడం దారుణమన్నారు.
బారికేడ్లు తొలగించామని గొప్పలు చెప్పారని, కానీ ఇవాళ అడుగడుగునా కంచెలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు . ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని ప్రశ్నించారు హరీశ్ రావు. చీఫ్ మార్షల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ లోపల మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరని , ఇక బయట కూడా నోరు విప్పకుండా చేయాలని చూడడం ప్రజాస్వమ్యం అనిపించుకోదని మండి పడ్డారు తన్నీరు హరీశ్ రావు, కడియం శ్రీహరి. ఇదేమి రాజ్యం పోలీసు రాజ్యం అంటూ నినాదాలు చేశారు .