ప్రశ్నిస్తే భయపడితే ఎలా
మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్ – మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడకుండా చేశారంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇదే సమయంలో అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆందోళనకు దిగారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజా పాలన అని ఎద్దేవా చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తాను కూడా శాసన సభ వ్యవహారాలు చూశానని ఇలాగైతే ప్రజలు ఛీదరించుకుంటారని హెచ్చరించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఆరు గ్యారెంటీల పేరుతో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వాటిని అమలు చేయలేక తమను టార్గెట్ చేయడం భావ్యం కాదన్నారు. చేసిన తప్పును చెప్పుకునే ప్రయత్నం చేస్తే బెటర్ అని సూచించారు వేముల ప్రశాంత్ రెడ్డి.
అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోందంటూ వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు.. కానీ తాము మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారంటూ ఆరోపించారు.