రైతు భీమా ఉన్నట్టా లేనట్టా
సీఎంను నిలదీసిన కవిత
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె రాష్ట్ర సర్కార్ ను నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రధానంగా తమ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఎంత మంది రైతుల ఖాతాల్లో సాయం జమ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత.
కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్ హయాంలో ఇచ్చే రైతు భీమా బాగో లేదంటూ ఆరోపించారని, ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ రైతులకు సంబంధించి పంటలకు భీమా స్థానంలో మెరుగైన స్కీమ్ ఏమైనా తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నదా అని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత.
ఈ సంవత్సరానికి రైతు బీమా అనేది తెలంగాణలో అమలు చేస్తున్నారా లేదా అన్నది బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడే బోనస్ ఇస్తామంటూ మాట మార్చారంటూ ధ్వజమెత్తారు కవిత. అంటే అర్థం మద్దతు ధరకు ధాన్యం కొనరా ..వీటిపై కూడా స్పష్టత ఇవ్వాలన్నారు.