NEWSTELANGANA

ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్నం అవుతా

Share it with your family & friends

నీలం మ‌ధు ముదిరాజ్ కామెంట్

హైద‌రాబాద్ – బీఎస్పీకి రాజీనామా చేసిన ప్ర‌ముఖ నాయ‌కుడు నీలం మ‌ధు ముదిరాజ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా నీలం మ‌ధు పార్టీలో చేర‌డం ఆనందంగా ఉంద‌న్నారు మంత్రి.

ఎన్ఎంఆర్ యువ సేన వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా మంత్రిని త‌న నివాసంలో క‌లుసుకున్నారు. శాలువాతో ఘ‌నంగా స‌న్మానం చేశారు. త‌న రాక‌ను తాను స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పారు మంత్రి.

పార్టీలో చేరడం పార్టీకి శుభపరిణామమ‌ని అన్నారు. నీలం మధు రాకతో పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజక వర్గంలో పార్టీకి మేలు చేకూరుతుందన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నాయకులు, కార్యకర్తలతో ఐక్యమత్యంతో పని చేయాలని సూచించారు.

మంత్రి సూచనలను విన్న నీలం మధు మంత్రి దామోదర ఆదేశాల‌కు అనుగుణంగా పార్టీ అభివృద్ధికి కంకణబద్ధుడినై పని చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో అంద‌రిని క‌లుపుకుని మెదక్ పార్ల‌మెంట్ ప‌రిధిలో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.