రాజీవ్ జీవితం చిరస్మరణీయం
రాష్ట్ర మంత్రి దాసరి సీతక్క
హైదరాబాద్ – రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దాసరి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ జీవితం స్పూర్తి దాయకమని పేర్కొన్నారు. గాంధీ కుటుంబం ఈ దేశానికి ఎంతో చేసిందన్నారు. ఇంకా చేస్తూనే ఉన్నదని కొనియాడారు.
దేశం కోసం ఆనాడు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని పొట్టన పెట్టుకున్నారని, ఇదే సమయంలో తనయుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆయన చేసిన సేవలకు గుర్తుగా తమ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ఇవాళ శాసన మండలిలో మంత్రి దాసరి సీతక్క ప్రసంగించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ విగ్రహం పెడితే తమకు వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు మంత్రి. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాము ఎవరినీ అవమానించడం లేదని స్పష్టం చేశారు. కొందరి జీవితాలు స్పూర్తి దాయకంగా ఉంటాయని అందుకే తాము గౌరవిస్తామని పేర్కొన్నారు.