NEWSTELANGANA

క‌డియంపై కోమ‌టిరెడ్డి క‌న్నెర్ర‌

Share it with your family & friends

అవమానించాడ‌ని ఆరోప‌ణ‌

హైద‌రాబాద్ – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. శాస‌న స‌భ సాక్షిగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, డిప్యూటీ సీఎం, స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌న‌ను కావాల‌ని టార్గెట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. ప‌దే ప‌దే త‌న‌ను ఎగ‌తాళి చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌డియం శ్రీ‌హ‌రి త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాద‌ని అవ‌మానించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

గ‌త ప‌దేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాల‌ని అన్నారు. త‌మ పార్టీ గురించి మాట్లాడే హ‌క్కు క‌డియంకు లేద‌న్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి తీరుతామ‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.